Prema Entha Madhuram Serial Today Episode

Prema Entha Madhuram Serial Today Episode 03-10-2023 | సీరియల్స్ తో సంపాదించండి

Facebook
WhatsApp
Telegram

Prema Entha Madhuram Serial Today Episode Date 3rd – October – 2023 ( Tuesday )

మీరు కూడా తెలుగు సీరియల్స్ చూస్తూ – ఇలా ఈ విధంగా టైపింగ్ చేసి రోజు డబ్బులు సంపాదించవచ్చు.ఇంట్లో ఉండి రాయగలిగే ఆసక్తి, ఓపిక , ఇంటర్నెట్ , మొబైల్ లేదా ల్యాప్టాప్ ఉంటే చాలు.రోజు టైపింగ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు.ఎలా అనేది త్వరలోనే మన ఈ dukebadi.in వెబ్సైట్ లో అప్డేట్ చేస్తాము.

ఇలాంటి జాబ్స్ వర్క్ సమాచారం త్వరగా మీకు తెలియాలి అంటే,రెడ్ కలర్ లో కింద బెల్ బటన్ ని క్లిక్ చేసి subscribe చేసుకోండి లేదా allow చేయండి.

అయితే ఇలా టైపింగ్ చేస్తూ డబ్బులు సంపాదించాలి అనుకునే వారు ( గృహీనులు ,విధ్యార్థులు ,రిటైర్ అయిన వారు – ఇలా ఎవరైనా సరే ) ఈ రోజు ఇక్కడ ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ లో భాగంగా ఒక ఎపిసోడ్ కి సంబందించిన మాటలని మీ ముందు ఉంచడం జరిగినది.

Prema Entha Madhuram Serial Today Episode

అదే విధంగా మీరు కూడా దీనిని మొత్తం చివరి వరకు చదవండిఅర్థం చేసుకోండిఎలా టైప్ చేశారు ? మీరు ఏ విధంగా టైపింగ్ చేయాలి అనేది దీనిని ఉదాహారణగా తీసుకొని వర్క్ చేయడానికి రెఢీ గా ఉండండి.

Serial NamePrema Entha Madhuram
Episode Date        3-10-2023 (Tuesday)
Prema Entha Maduram CastSriram Venkat , Varsha HK
Serial LanguageTelugu
Watch Now On ZEE5Click Here

Prema Entha Madhuram Serial Today Episode : ఆర్య – నేనేది మర్చిపోలేదు, నేనేమీ మారలేదు, కేవలం పరిస్థితులకు అనుగుణంగా నన్ను నేను మార్చుకుంటూ పోతున్నాను, అంతే. నా వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగదు, మీరేం బాదపడకండి అని ఆర్య అంటారు.

పద్దూ – బాదపడకుండా  ఎట్టా ఉంటాము సారు, మీ పక్కన స్తానం మా అమ్మిది, ఈ ఇంటికి వారసులు మా అమ్మీకి పుట్టిన పిల్లలు, మీరు వాళ్ళని కాదని ఇంకెవరినో దత్తత తీసుకొని  వాళ్ళని వారసులు చేస్తామంటే నష్టపోయేది ఎవరు సారు, మా అమ్మి దానికి పుట్టిన పిల్లలు.

సుబ్బు – మా బుజ్జమ్మ విషయం  పక్కన పెట్టండి సర్, కానీ  మీరు పెళ్ళి చేసుకోబోతున్నది ఎవర్ని, మీ ప్రాణాలూ తియ్యాలనుకొని మీ మీద పంతం పట్టి తిరిగిన మీ శత్రు చెల్లెల్ని, ఇది మీకు క్షేమం కాదు సర్, అందుకోసమైన మీ పెళ్ళి మానుకోండి సర్, మీకు చేతులెత్తి మొక్కుతాము సర్, దయచేసి ప్రమాదాన్ని కోరి తెచ్చుకోకండి.

ఆర్యవర్ధన్ – మీ బాదని నేను అర్థం చేసుకోగలను సుబ్బుగారు, కానీ ఇప్పుడు  ఒకటి చెప్పగలను, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను ఒకే మాటకి కట్టుబడి ఉంటాను, మాట ఇచ్చాను నిలబెట్టుకోవాలి, ఈ పెళ్ళి జరగాలి దయచేసి అర్థం చేసుకోండి.

పద్దూ – ఏంది సారు, ఎందుకట్ట అంటూండారు.

సుబ్బు – పద్దూ ఇక మాట్లాడి లాభం లేదు, ఆయన నిర్ణయం తీసుకున్నాక మార్చుకోరని తెలిసిందే కదా , తన బాణంతో అప్పటి గాయం చేసిన రాముడి కథ గుర్తుకొస్తుంది పద్దూ, ఏ బాధ వచ్చిన శ్రీరాముణ్ణి తలచుకొని తనకే బాదను చెప్పుకొనే కప్పని సాక్షాత్తూ శ్రీరాముడే బాదపెడితే ఇంకెవరికీ చెప్పుకుంటుంది మనం అంతే పద పద్దూ.

అంజలి – బాబాయిగారు  ఆగండి మీరు వెళ్ళకండి.

Telugu Typing Job – Click Here

సుబ్బు – ఏ హక్కుతో ఉండాలమ్మ కాసేపటిక్రితం వరకు ఇది మా అల్లుడి గారి ఇల్లు అని వచ్చామమ్మ , ఇప్పుడు ఏ హక్కు లేదని తేలిపోయింది అందుకే వెళ్లిపోతున్నాం, రా పద్దూ 

అంజలి – పిన్నిగారు మీరైన చెప్పండి.

పద్దూ – మా అమ్మినే దూరం అయ్యాక, ఇక మామీద వచ్చిన బందాలు దూరం అయితే ఏంటి, దగ్గర అయితే ఏంటి,వస్తాను తల్లి – సారు ఈ పెళ్ళి కానీ జరిగితే, ఆ పందిట్లో  మీరు రెండు చావులు చూస్తారు పద సుబ్బు.

జలందర్ – ఏంటి బావగారు ఈ ఎమోషనల్  బ్లాక్ మెయిల్ కి లొంగిపోయి పెళ్ళి ఆపేయ్యారు కదా, ఆ అసలే మా చెల్లి సెన్సిటివ్, మొండిది కూడా, చచ్చిన చచ్చిపోతుంది.

ఆర్య – ముహూర్తం టైమ్ కి నేను మాండపంలో ఉంటాను నువ్వీకా బయల్దేరవచ్చు.ఆర్య పద్దూ అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటాడు మా అమ్మి బతికుండగానే మీరు ఇంకో పెళ్ళి చేసుకోవడం ఏంటి సారు అసలు మీకు భార్య పిల్లకాయలు ఉన్నారని గుర్తున్నదా?

సుబ్బు – మా బుజ్జమ్మ ఎక్కడున్నా ఏదో ఒక రోజున మీరు వెతికి తీసుకు వచ్చి మా ముందు నిలబెడతారు అన్న నమ్మకం సర్ 

పద్దూ – ఈ పెళ్ళే కానీ జరిగితే ఆ పందిట్లో మీరు రెండు చావుల్ని  చూస్తారు.

జెండే – ఆర్య పద్దుగారు వాళ్ళు వచ్చారంట వాల్లెమైన హర్ట్ అయ్యేలా మాట్లాడారా?

ఆర్య – లేదు జెండే వాళ్ళ బాదని బయట పెట్టుకున్నారంతే

జెండే – వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్య లేదంటే నేను ముందే మ్యానేజ్ చేసే వాణ్ని.

ఆర్య – ఇట్స్  ఒకే జెండే, నిజం తెలిసాక వల్లే మనల్ని అర్థం చేస్కుంటారు ఒక రకంగా ఇది కూడా మన మంచికే జరిగింది.జలందర్ అండ్ చాయా ఇంకా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు.

జెండే –  హమ్ ఎస్ ఆర్య, ఆ అవును  ఇంతకీ పెళ్ళి ఎక్కడ ఏర్పాటు  చేద్దాం?

ఆర్య – మన ఇంట్లోనే

జెండే – మన హౌస్, ఆ మన హౌస్ లోన బట్ రోహిత్ ని మన గెస్ట్ హౌస్ నుంచి మన ఇంటికి తీసుకొచ్చా మ్ కదా

ఆర్య – అందుకే ఇక్కడే ఏర్పాట్లు చేయమంటున్నాను.జలందర్ ఈ పెళ్ళి జరుగుతుందో లేదో ఎవరు ఎటు నుంచి అపుతారో అనే భయంతో సెక్యూరిటీ ని టైట్ చేసి వచ్చి పోయే వాళ్ళందరిని కచ్చితంగా చెక్ చేస్తాడు. సొ వేరే ఎక్కడైనా ప్లాన్ చేస్తే రోహిత్ అక్కడికి రీచ్ అవ్వడం కస్టం ఔతుంది.ఆల్రెడీ మన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి జలందర్ కి దొరికే ఛాన్స్ ఉండదు.

జెండే – యువర్ రైట్ ఆర్య, ఎంత వెతికినా ఆ గేటు దగ్గర కాపలా కాస్తాడే తప్ప లోపల ఉన్న వాడ్ని కనిపెట్టలేడు.ఆ పితా బుర్రకి ఆలోచ కూడా రాదు.

ఆర్య – రోహిత్ ని కేర్ఫుల్ గా ఉండమని చెప్పు జెండే, అండ్ నువ్వేం చెయ్యాలో తెలుసుగా?

జెండే – ఆల్రెడీ అన్నీ అరేంజమెంట్స్ చేశాను, ఆర్య వీలైన చోటళ్ల సి సి కెమెరాస్ కూడా ఆరెంజ్ చేశాను, అను వచ్చిందంటే మాత్రం ఈ సారి కచ్చితంగా మన కంట పడి తీరుతుంది.

ఆర్య – అను కచ్చితంగా వస్తుందని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్న జెండే.

మాన్సీ – హమ్ కంగ్రాచులేషన్స్, మొత్తానికి మీరు అనుకున్నది సాదిస్తున్నారు. మా బ్రో ఇన్ ల పెళ్ళికి ఒప్పుకున్నారు అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. వాట్ ఎవర్ ఈట్ ఇస్, వర్ధన్ ఫ్యామిలికి మీరు కోడలిగా వెళ్తున్నారు.

చాయా – వెళుతున్నారు కాదు, వెళ్తున్నాం. నీకు మాటిచ్చినట్లే, నిన్ను కూడా  తిరిగి ఆ ఇంట్లోకి రప్పిస్తాను మాన్సీ,నువ్వు చూస్తూ ఉండు.       

మాన్సీ – చూద్దాం లెండి, అక్కడికి వెళ్ళాక ఎలా మారిపోతారో, హమ్ మీరు కూడా వర్ధన్ ఫ్యామిలీ పరువు గౌరవం ప్రేమ అని ఎన్ని కబుర్లు చెప్తారో.

జలందర్ – నో వే మాన్సీ, నా చెల్లెల్ని తక్కువ అంచనా వెయ్యకు ఏ సిట్యుయేషన్ అయిన తనకి అనుకూలంగా మార్చుకోవడంలో మా చెల్లెలు ఆరి తేరి పోయింది. అయిన తను ఆర్యవర్ధన్ ని పెళ్ళి చేసుకుంటుంది తన మీద ప్రేమతో కాదు నా పంతం నెరవేర్చడానికి పెళ్లయ్యాక వాళ్ళందరిని ఎలా అడుకుంటుందో నువ్వే చూద్దువు గాని.

చాయా – బాగా చెప్పావ్ అన్నయ్య, ఆర్యవర్ధన్ తన అత్త మామల్ని, నీరజ్, అంజాలీల మాటల్ని కూడా పట్టించుకోలేదు. ఈ పెళ్ళి గురుంచి స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకున్నాడు. అసలు ఇంకో విషయం ఏంటో తెలుసా మీరు చెప్పినప్పుడే నాకొక విషయం అర్థమైంది, తనకి తెలియకుండానే ఆర్య నా కంట్రోల్ లోకి వచ్చేశాడు. హమ్ సరే మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా అక్కడికి వెళ్లాల్సిన ఏర్పాట్ల గురించి ఆలోచించండి అన్నయ్య.

జలందర్ – ఒకే

మాన్సీ – చాయా గారి కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు పాజిటివ్ గానే అనిపిస్తుంది కానీ, మనం వాళ్ళని అంత తక్కువ అంచనా  మాత్రం వేయకూడదు.

జలందర్ – అవును  మాన్సీ, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు ఎలాంటి ప్లాన్ వేస్తారో అనే అనుమానంతోనే సెక్యూరిటీ ని నా మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాను.

మాన్సీ – అంతా కంటే ముందు మనం అను మీద కన్నేసి ఉంచాలి, తనకున్న సెంటిమెంట్ కి, బ్రో ఇన్ లతో కలిసి ఉండటానికి తిరిగి రాదు కానీ, మన వల్ల బ్రో ఇన్ లకి ఏమన్నా అవుతుందనే బయం తోను లేక తన పిల్లలకు దక్కాల్సిన స్తానం వేరే వాళ్ళకు దక్కుతుందనే కంగారుతోనో తను బ్రో ఇన్ లని పెళ్ళి చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించవచ్చు కదా. సొ ఫస్ట్ మనం అనుని పిల్లల్ని పెళ్ళి అయ్యేంత వరకు బయటకి రాకుండా హౌస్ ఆరెస్ట్ చెయ్యాలి.

జలందర్ –  అదెంత పని ఇప్పుడే మా వాళ్ళకి కాల్ చేస్తాను ఆ అను ఇంటి అడ్రెస్ చెప్పు.

మాన్సీ – నాకు మీ మేనేజర్ నెంబర్ పంపండి, నేనే ఫాలోఅప్ చేస్తాను, ఎట్టి పరిస్తితుల్లోనూ ఈ పెళ్ళి ఆగకూడదు.

ఆకాంక్ష – అమ్మ హాలిడే కదా, టివిలో టామ్ అండ్ జెర్రీ చూస్తానంటే, చూడనికుండ ఎక్కడికి తీసుకెళ్తున్నావ్.

అను – టీచర్ వాళ్ళ ఇంటికి అక్కి.

అభయ్ – టూషన్ కా అమ్మ?

అను – కాదు అభయ్, ఆ.. నాకు పెళ్ళికి పిండి వంటలు చేసే  పెద్ద ఆర్డర్ వచ్చింది కదా, నేను, చంద్రమ్మ ఇవ్వాళ  ఈ నైట్ అంతా పెళ్ళి దగ్గర ఉంటాము, మీరు టీచర్ దగ్గరే ఉండండి.

ఆకాంక్ష – పెళ్ళికి నేను వస్తానమ్మ

అను – అక్కి

ఆకాంక్ష – ప్లీస్ అమ్మ పెళ్ళికి నేను వస్తానమ్మ నేను నీతో పాటు వస్తానమ్మ

అను – అక్కి, రోడ్డు మీద ఇలా గొడవ చెయ్యొద్దు కాముగా పద

విలన్ – ఎక్కడికి పోయింది, ఇటు వైపే వచ్చిందే ఎటు వెళ్ళినట్టు చెప్పండి మేడమ్

మాన్సీ – అను పిల్లలు కనిపించారా ?

విలన్ – లేదు మేడమ్ నేను కిడ్నాప్ చేద్దామనే లోపు ఇంటికి తాళం వేసి ఉంది, పిల్లలతో బయటికి వచ్చేసింది మేడమ్.

మాన్సీ – అవునా! కొంపదీసి పెళ్ళి మండపానికేమైన వస్తుందా? అసలు నువ్వు వాళ్ళని ఫాలో అవ్వలేదా?

విలన్ – ఫాలో అవుతూనే వచ్చాను మేడమ్ ఎక్కడో మీస్ అయింది మేడమ్

మాన్సీ – ఏయ్ నువ్వు ఎమ్ చేస్తావో తెలీదు, అనుని, పిల్లల్ని ముందు కిడ్నాప్ చేయి, పెళ్ళి అయ్యేంతవరకు వాళ్ళు బయటికి రాకూడదు.

విలన్ – అలాగే మేడమ్ నేను వెతుకుతాను మేడమ్

అను – సారీ టీచర్, మీకు శ్రమ ఇస్తున్నాను, ఏం అనుకోకండి.

టీచర్ – అయ్యయ్యో, భలేవారే, పిల్లల్ని చూసుకోవడం నాకు శ్రమేంటండీ, పైగా అక్కి అభయ్ చాలా బుద్దిగా ఉంటారు, మీరు ప్రశాంతంగా వెళ్ళి మీ వర్క్ చూస్కోనీ రండి, పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను.

అను – థాంక్యు సో మచ్ టీచర్, అక్కి కోపడ్డానని అలిగావ సారీ  రా, ఆ.. ఏదో టెన్షన్లో అరిచేశాను, అల్లరి చేయకుండా టీచర్ దగ్గరే ఉంటావు కదా.

అభయ్ – అక్కి అమ్మ మన కోసమే కదా కస్టపడేది అమ్మ మీద అలక్కుడదూ తప్పు నువ్వు వెల్లమ్మ చెల్లిని నేను చూసుకుంటానులే.

అను – సరే జాగ్రత్త నాన్న, హ జాగ్రత్త, ఉంటాను.

టీచర్ – అలాగేనండి

అను – అసలు ఎవరితను నా వెంట ఎందుకు పడుతున్నాడు.

విలన్ – షీట్ మిస్ అయింది.

జలందర్ – రేయ్ అందరూ ఎవ్రి మినిట్, ఎవ్రి సెకండ్, అలర్ట్ గా ఉండండి. ఈ పెళ్ళి జరగడం నాకు చాలా ముఖ్యం. ఈ పెళ్ళిని ఆపడానికి చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. సో నేనిచ్చిన గెస్ట్ లిస్ట్ లో వాళ్ళు కాకుండా వేరే ఎవరు వచ్చిన, అనుమానంగా అనిపించినా వెంటనే, నాకు ఇన్ఫార్మ్ చేయండి గాట్ ఈట్!

విలన్ – ఎస్ సర్

జలందర్ – చెప్పు మాన్సీ

మాన్సీ – అను పిల్లలు ఇంట్లో ఎవరు లేరంటా, వాళ్ళని ఫాలో అయి వెళ్ళిన రౌడీలకు అను కనిపించకుండా మిస్ అయిపోయింది.

జలందర్ – అను మన ప్లాన్ ముందే గెస్ చేసి ఎక్కడ తనని హౌస్ అరెస్ట్ చేస్తామో అని తెలివిగా ఎస్కేప్ అయింది.

మాన్సీ – అను కచ్చితంగా పెళ్ళి దగ్గరికే వస్తుంది, నాకు తెలిసి తనకున్న సెంటిమెంట్ కి డైరెక్ట్ గా బ్రోఇన్ల కంట్లో అయితే పడదు కానీ,

జలందర్ – పొరపాటున ఆర్య అనుని చూశాడంటే మాత్రం, మన గేమ్ కి ఎండ్ కార్డ్ పడ్డట్టే.

మాన్సీ – అసలు ఇప్పుడు ఎమ్ చేద్దామంటారు?

జలందర్ – అను మొబైల్ నెంబర్ ట్రేస్ చెయ్యమని చెప్పు, అన్నీ దాటుకుని పెళ్ళి వరకు వచ్చిన, నా నుంచి తప్పించుకోలేదు.

మాన్సీ  – హమ్ ఒకే, అండ్ వన్ మోర్ థింగ్, మీరు మాత్రం అందరి మీద ఒక కన్నేసి ఉంచండి, అక్కడ ఎవర్ని నమ్మడానికి వీలు లేదు, నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు, అందుకే నేను మరి మరి చెప్తున్నాను, బీ కేర్ ఫుల్.

జలందర్ – నేను చూసుకుంటాను.

మాన్సీ – సరే అను గురించి ఏమైనా తెలిసింద, ఎక్కడికి వెళ్ళిన ఇక్కడికే కదా రావాలి, మీ టీమ్ ముగ్గురే అన్నారు కదా నలుగురు ఉన్నరేంటి.

అను – సర్ –

Prema Entha Madhuram Zee telugu serial – తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాము. నెక్స్ట్ ఏం జరగబోతుందనేది, మీరేమైన గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి. అలాగే ఎలా టైపింగ్ చేస్తూ డబ్బులు సంపాదించడం గురించి ఇంటరెస్ట్ ఉన్న వారు Interested అని కామెంట్ చేయండి.