Praja Palana Scheme FAQ

Praja Palana Scheme FAQ లో మీ ప్రశ్నలకు సమాధానాలు 2024

Facebook
WhatsApp
Telegram

ప్రజాపాలన దరఖాస్తు – 6 గ్యారెంటీలు – సందేహాలు:

Praja Palana Scheme FAQ

Praja Palana Scheme FAQ: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ పథకాలలో డిసెంబరు 28 తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ఐదు గ్యారంటీ పథకాలు అయితే ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియా కొనసాగుతుంది.

అయితే ఈ అప్లికేషన్ ఫామ్ నింపే సమయంలో చాలా మందికి చాలా విధాలుగా సందేహాలు వ్యక్తమవుతుంటాయి.అందులో కొన్ని సందేహాలకు సమాధానంగా సంబంధిత అధికారులు ఏమని సూచనలు ఇచ్చారో ఇప్పుడు చూద్ధాం.

ప్రజా పాలన కార్యక్రమంలో ఎదురయ్యే ప్రశ్నలు వాటి సమాధానాలు:

మేము ఇతర ప్రాంతాల్లో ఉంటున్నాము.మా కుటుంబ సభ్యులు అందరం స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలా?

సమాధానం : అందరు రావలసిన అవసరం లేదు.మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒక్కరు వచ్చి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.మీ కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలతో అప్లికేషన్ ఫారంతో జతపరిచి,మీ గ్రామ పంచాయతీలలో లేదా మునిసిపల్ వార్డ్స్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఒకవేళ మీ కుటుంబ సభ్యులలో ఒక్కరు కూడా దరఖాస్తు డైరెక్ట్ గా చేయలేని పరిస్థితిలో మీ ఊరిలో మీకు తెలిసిన వారి ద్వారా లేదా మీ స్నేహితుల ద్వారా అయిన వారికి మీ కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు,సంబంధిత పత్రాల నకలు వారికి ఆన్లైన్ ద్వారా అందించి, దరఖాస్తు చేయవచ్చు అని సూచించారు.

మేము నలుగురం అన్నదమ్ములం.ముగ్గురు అన్నలు వేరే ప్రాంతాలలో ఉంటున్నారు.నేను ఒక్కడినే ఊర్లో ఉంటున్నాను.నేను మా అన్నదమ్ముల దరఖాస్తు ఇవ్వవచ్చా? అనే ప్రశ్నకు

సమాధానం: ఇవ్వవచ్చు.

మాది ఉమ్మడి కుటుంబం కానీ అన్నదమ్ములందరం వేరుగా ఉంటున్నాము.మాకు రేషన్ కార్డులు వేరే సెపరేట్ గా ఉన్నాయి.మాకు అందరికీ వేరు వేరుగా ఫామ్స్ అందరికీ ఇస్తారా? అనే ప్రశ్నకు

సమాధానం: వేరు వేరు రేషన్ కార్డులు ఉన్న వారు వేరు వేరుగా దరఖాస్తు చేసుకోవాలి ఒకవేళ ఉమ్మడి కుటుంబానికి రేషన్ కార్డు ఒక్కటే ఉండి అందులో ఆ కుటుంబ సభ్యులందరి పేర్లు ఉన్నట్లైతే ఒక్క దరఖాస్తు సరిపోతుందని తెలిపారు.

నాకు ఈ గ్రామంలోనే రేషన్ కార్డు ఉంది. ఆధార్ కార్డు మాత్రం వేరే ఊరులో ఉంది,గ్యాస్ కనెక్షన్ కూడా అక్కడే ఉంది.నేను ఎక్కడ అప్లై చేసుకోవాలి? అనే ప్రశ్నకు

సమాధానం:ఆధార్ కార్డు,గ్యాస్ కనెక్షన్ అడ్రస్ ఎక్కడ ఉన్నా కానీ,రేషన్ కార్డులో ఏ ఊరి అడ్రస్ అయితే ఉందో ఆ ఊరి అడ్రస్ లోనే దరఖాస్తు చేసుకావాలి అని సూచించారు.

నాకు రేషన్ కార్డు లేదు నేను ఈ ఆరు పథకాలకు అర్హుడనేనా? కాదా? అనే ప్రశ్నకు

సమాధానం: రేషన్ కార్డు లేకున్నా కూడా ఈ 6 పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.అప్లికేషన్ ఫామ్ లో రేషన్ కార్డు నంబర్ అడిగిన చోట “రేషన్ కార్డు లేదు “అనీ రాసి, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు వివరాలతో అన్ని వివరాలు నింపిన తరువాత ఒక వైట్ పేపర్ పై ప్రజా పాలన అధికారికి కానీ,మీ మండల తాశీల్దార్ గారికి గానీ కొత్త రేషన్ కార్డు కావాలి అని మీ కుటుంబ వివరాలు రాసి ప్రజా పాలన దరఖాస్తుతో జత చేసి ఇవ్వాలని తెలియజేసారు.

మా తల్లిదండ్రులకు,నాకు,నా పిల్లలకు ఒకే రేషన్ కార్డు ఉన్నది.అందరూ అప్లై చేసుకోవాలా?
అనే ప్రశ్నకు

సమాధానం: మీ కుటుంబ సభ్యులందరూ ఒకే రేషన్ కార్డులో ఉంటే ఒకే దరఖాస్తు ఫారంను సెపరేట్ రేషన్ కార్డు ఉంటే సెపరేట్ గా దరఖాస్తు ఫారంను నింపాల్సి ఉంటుందని తెలిపారు.

మా తల్లిదండ్రుల రేషన్ కార్డులో నా పేరు ఉంది. నాతో పాటు నా పిల్లలు కూడా ఉన్నారు.నాకు సెపరేట్ రేషన్ కార్డు కావాలి. ఏం చేయాలి? అనే ప్రశ్నకు

సమాధానం: ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ తో పాటు ఒక వైట్ పేపర్ మీద మీ కుటుంబ సభ్యుల పేర్లు,ఆధార్ కార్డు వివరాలతో మాకు తెల్ల రేషన్ కార్డు కావాలి అనీ రాసి ప్రజా పాలన అధికారికి ఇవ్వాల్సి ఉంటుందని సూచన చేశారు.