free-scholarship-for-students-in-india-2025

Free Scholarship For Students in India 2025 | భారతదేశంలో అందుబాటులో ఉన్న Best స్కాలర్‌షిప్‌లు

Facebook
WhatsApp
Telegram

భారతదేశంలోని విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌ వివరాలు

Free Scholarship For Students in India 2025 | భారతదేశంలో అనేక స్కాలర్‌షిప్‌లు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవేశపెట్టారు.ఈ స్కాలర్‌షిప్‌లు విద్యార్థుల చదువు కొనసాగించేందుకు, వారి ఫ్యూచర్ విద్యా ఖర్చులను తగ్గించేందుకు చాలా సహాయపడతాయి.

ఈ ఆర్టికల్‌లో, భారతదేశంలోని ప్రధాన స్కాలర్‌షిప్‌ల గురించి పూర్తి సమాచారం,వాటి అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, మరియు స్కాలర్‌షిప్‌లు అందించే ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం.ఈ ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో చదవుకునే వారికి షేర్ చేయండి.ఒకరికి హెల్ప్ చేసిన వారావుతారు.

free-scholarship-for-students-in-india-2025

భారతదేశంలో అందుబాటులో ఉన్న ప్రముఖ స్కాలర్‌షిప్‌లు | free scholarship for students in india 2025

NSP (National Scholarship Portal) ద్వారా అందించే స్కాలర్‌షిప్‌లు

  • NSP వెబ్‌సైట్ (https://scholarships.gov.in) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్‌షిప్‌లకు అప్లై చేయవచ్చు.
  • అన్ని రకాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు NSP వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
  • కొన్ని ముఖ్యమైన NSP స్కాలర్‌షిప్‌లు:
  • Pre-Matric & Post-Matric Scholarships for SC/ST/OBC Students
  • Minority Scholarships
  • Merit Cum Means Scholarships

PM Scholarship Scheme (PMSSS)

  • కేంద్రీయ సైనిక కుటుంబాల పిల్లలకు (Ex-Servicemen కుటుంబాలకు) ఈ స్కాలర్‌షిప్ అందుబాటులో ఉంది.
  • ట్యూషన్ ఫీజు కవర్ చేయబడుతుంది మరియు విద్యార్థులకు అదనపు స్టైఫండ్ కూడా అందిస్తుంది.

Jindal Scholarship (Sitaram Jindal Foundation Scholarship)

  • పేద విద్యార్థులకు విద్య కోసం ఆర్థిక సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన Scholarship,Jindal Scholarship.
  • ఈ Scholarship 11th, 12th, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్థులకు అందుబాటులో ఉంది.

Tata Scholarship for Indian Students

  • టాటా ట్రస్ట్ ద్వారా రానున్న ఇంజినీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్ విద్యార్థులకు విద్యాసహాయంగా Tata స్కాలర్‌షిప్ అందించబడుతుంది.
  • ఈ స్కాలర్‌షిప్‌ కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు కూడా వర్తిస్తుంది.

HDFC Educational Crisis Scholarship Support

  • ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) స్కాలర్‌షిప్ అందిస్తోంది.
  • విద్యార్థుల యొక్క విద్యా ఖర్చుల కోసం 10,000 – 75,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.

LIC Golden Jubilee Scholarship

  • LIC సంస్థ ద్వారా మెరిట్ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది.
  • 12th తరగతి తర్వాత డిగ్రీ లేదా డిప్లొమా చదివే విద్యార్థులకు వర్తిస్తుంది.
  • ప్రతి ఏడాది విద్యార్థికి రూ. 20,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా.

K.C. Mahindra Scholarship for Postgraduate Studies

  • అత్యుత్తమ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం అందించబడే స్కాలర్‌షిప్ C. Mahindra Scholarship.
  • ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా రూ. 8 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.

Indira Gandhi Scholarship for Single Girl Child

  • ఒకే అమ్మాయి ఉన్న కుటుంబాల్లో ఉన్న విద్యార్థినుల కోసం Indira Gandhi Scholarship for Single Girl Child స్కాలర్‌షిప్ ప్రత్యేకంగా రూపొందించబడింది.
  • పీజీ చదివే అమ్మాయిలు ఈ స్కాలర్‌షిప్‌ కి దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు | free scholarship for students in india 2025

స్కాలర్‌షిప్ పేరుఅర్హతలువయస్సు పరిమితిడాక్యుమెంట్లు
NSP ScholarshipsSC/ST/OBC/Minority Students8 నుండి 25 ఏళ్లలోపుఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, విద్యాసంబంధిత ధృవీకరణ పత్రాలు
PMSSSEx-Servicemen కుటుంబాలు18-25 ఏళ్లుకుటుంబ ఆదాయ ధృవీకరణ, విద్యా ధృవీకరణ పత్రం
Jindal Scholarshipపేద విద్యార్థులు16-30 ఏళ్లుఆదాయ ధృవీకరణ, విద్యా ధృవీకరణ పత్రాలు
Tata Scholarshipమెరిట్ విద్యార్థులు17-30 ఏళ్లుమార్క్‌షీట్లు, ఆదాయ ధృవీకరణ, విద్యా ధృవీకరణ పత్రాలు
LIC Scholarship12th పూర్తి చేసిన విద్యార్థులు17-25 ఏళ్లువిద్యా ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ

స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేయడం ఎలా? | free scholarship for students in india 2025

1.NSP (National Scholarship Portal) ద్వారా అప్లై చేయడం

  • free scholarship for students in india 2025 | అధికారిక వెబ్‌సైట్‌ (https://scholarships.gov.in) లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • స్కాలర్‌షిప్ ఎంపిక చేసి,తర్వాత అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి దరఖాస్తు పంపించాలి.
  • దరఖాస్తు ఆమోదించిన తర్వాత స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

2.స్కాలర్‌షిప్ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేయడం

  • free scholarship for students in india 2025 | ప్రతి స్కాలర్షిప్ కి సంబంధించిన వెబ్సైట్లు వేరుగా ఉంటాయి.ప్రతి స్కాలర్‌షిప్‌కు సంబంధిత అధికారిక వెబ్‌సైట్లలో అప్లికేషన్ ఫారమ్ అందుబాటులో ఉంటుంది.
  • ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు పూర్తి చేయాలి.

స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు | free scholarship for students in india 2025

NSP (National Scholarship Portal) ద్వారా అప్లై చేయడం

  • NSP స్కాలర్‌షిప్‌లు: ప్రతి సంవత్సరం జూలై-అక్టోబర్ మధ్య దరఖాస్తు ప్రక్రియ జరుగుతుంది.
  • LIC Golden Jubilee Scholarship: ప్రతి సంవత్సరం నవంబర్-డిసెంబర్ మధ్య అప్లై చేయాలి.
  • Tata Scholarship:Tata Scholarship కి ప్రతి సంవత్సరం జూన్-ఆగస్టు మధ్య దరఖాస్తు చేసుకోవాలి.

(FAQs)

Q1: అన్ని స్కాలర్‌షిప్‌లకు ఒకే విధమైన డాక్యుమెంట్లు అవసరం అవుతాయా?
A: కాదు, స్కాలర్‌షిప్‌ పై ఆధారపడి డాక్యుమెంట్లు మారవచ్చు. కానీ, ముఖ్యంగా స్టడీ మరియు క్యాస్ట్ సర్టిఫికెట్స్ అవసరం అవుతాయి.
Q2:అందరూ విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు అప్లై చేసుకోవచ్చా?
A: కొన్ని స్కాలర్‌షిప్‌లు మాత్రం కుల, ఆదాయ పరిమితిపై ఆధారపడి ఉంటాయి. కానీ, మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందరికీ అందుబాటులో ఉంటాయి.
Q3: ఒక విద్యార్థి ఒక స్కాలర్‌షిప్‌ల కంటే ఎక్కువ స్కాలర్‌షిప్‌లకు అప్లై చేయవచ్చా?
A: అవును, కానీ కొన్ని స్కాలర్‌షిప్‌లు ఒకేసారి పొందే అవకాశం ఉండదు.
Q4: స్కాలర్‌షిప్ స్టేటస్ ఎక్కడ చెక్ చేయాలి?
A: NSP వెబ్‌సైట్ లేదా సంబంధిత సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో స్కాలర్‌షిప్ స్టేటస్ చెక్ చేయవచ్చు.

END

స్కాలర్‌షిప్‌లు విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం. ఎందుకు అంటే మెరిట్ ఉండి కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ స్కాలర్షిప్లు ఎంతగానో ఉపయోగపడతాయి.ప్రతి ఒక్క విద్యార్థి తమ అర్హతను తెలుసుకొని, సరైన స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి. సరైన సమయంలో అప్లై చేసి, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడం చాలా ముఖ్యమైన ప్రక్రియ.

ఉపయోగకరమైన లింకులు: